హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రాఫిక్ రూల్స్ పాటించాలి: ఎస్పీ

BDK: వాహనదారులు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ హెల్మెట్‌, సీటుబెల్ట్‌ ధరించాలని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. కొత్తగూడెం ఉమెన్స్‌ కళాశాల విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. డీఎస్పీ ఆదినారాయణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.