హైదరాబాద్: 28°C
వార్తలు

కార్మిక కోడ్లను రద్దు చేయాలి: ఆశా వర్కర్లు

MDK: ఆగస్టు10న తలపెట్టిన 'జైల్ భరో' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శివంపేట ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు గోపమ్మ పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక,రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాడతామన్నారు. కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నిర్మల, స్వప్న, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.