KRNL: గోవర్ధన్ నగర్ రైతు బజార్ నిర్మాణం పూర్తయి నెలలు గడిచినా ప్రారంభించకపోవడం అధికారుల నిర్లక్ష్యమని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎస్. శ్యామల విమర్శించారు. రైతు బజార్ వద్ద నిర్వహించిన ధర్నాలో వెంటనే బజార్‌ను ప్రారంభించి రైతులు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బజార్ ప్రారంభమైతే సమీప గ్రామాల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
వార్తలు
రైతు బజార్‌ను వెంటనే ప్రారంభించాలని ధర్నా


