హైదరాబాద్: 28°C
వార్తలు

కరాటేలో విద్యార్థుల పతకాల పంట

ప్రకాశం: గిద్దలూరుకు చెందిన సుమారు 20 మంది కరాటే విద్యార్థులు ఆగస్టు 2న విజయవాడలో జరిగిన 23వ ఏపీ రాష్ట్ర కరాటే ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. వీరు బంగారు, వెండి, కాంస్య పతకాలను కైవసం చేసుకుని గిద్దలూరుకు పేరు తెచ్చారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి విజేతలను, వారి గురువు సుబ్రహ్మణ్యంను అభినందించి, భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.