BHNG: స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం గోపృష్ట దర్శనం వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారని విశ్వసించే పవిత్ర గోమాత దర్శనాన్ని భక్తులకు కల్పించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతి పొందారు.
వార్తలు
స్వర్ణగిరిలో వైభవంగా గోపృష్ట దర్శనం


