హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: విరూపాక్షిపై కేసు ఎత్తివేయాలని నిరసన

KRNL: చిప్పగిరి మండలంలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ఎమ్మెల్యే విరూపాక్షిపై నమోదు చేసిన హత్యాయత్నం కేసును ఖండించారు. నేమకల్లు ఘటనలో బాధితులకు అండగా నిలిచిన వారిపైనే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మారయ్య విమర్శించారు. కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.