ATP: పామిడి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు..చదివే ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఎస్.ఐ హనుమంతు మాట్లాడుతూ.. డ్రగ్స్ ఆరోగ్యానికి హానికరమన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో చదివి మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలన్నారు.
వార్తలు
డ్రగ్స్ నిర్మూలన పై విద్యార్థులకు అవగాహన ర్యాలీ


