హైదరాబాద్: 28°C
వార్తలు

హుజూర్‌నగర్ గ్రంథాలయాన్ని పరిశీలించిన జిల్లా సెక్రటరీ

SRPT: హుజూర్‌నగర్ ప్రభుత్వ గ్రంథాలయాన్ని జిల్లా సెక్రటరీ రామచంద్ర నాయక్ పరిశీలించారు. శుక్రవారం సెలవు రోజుల్లో కూడా గ్రంథాలయాన్ని తెరిచి ఉంచాలని నిరుద్యోగులు వినతిపత్రం అందజేశారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాగే గ్రంథాలయ పని వేళలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగిస్తామని వెల్లడించారు.