హైదరాబాద్: 28°C
వార్తలు

సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టు

ఖమ్మం జిల్లా సైబర్ మోసాల కేసులో దర్యాప్తు ముమ్మరమవడంతో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రముఖ సంస్థల పేరిట రూ. 4.70 కోట్లు కొల్లగొట్టిన సత్తుపల్లికి చెందిన ముగ్గురిని సైబర్ పోలీసులు నెల వ్యవధిలో అరెస్ట్ చేశారు. గతంలోనే ఈ కేసులో 55 మందిని అదుపులోకి తీసుకోగా, తాజాగా హైదరాబాద్‌ మాదాపూర్‌లో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు.