హైదరాబాద్: 28°C
వార్తలు

మున్సిపాలిటీలో కమీషన్ల దందా..?

ఏదులాపురం మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్ల వసూళ్లు చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధికి మంత్రి పొంగులేటి మంజూరు చేసిన రూ. 75 కోట్ల నిధులపై కన్నేసి, కాంట్రాక్టర్ల నుంచి 10% కమీషన్ డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇళ్ల నంబర్లు, పర్మిషన్ల పేరిట సాగుతున్న దందాపై మంత్రి కౌన్సిలింగ్ ఇచ్చినా ప్రజాప్రతినిధులు తీరు మార్చుకోకపోవడం కలకలం రేపుతోంది.