హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు కేంద్రం యోచన

ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ బిల్లుపై ప్రత్యేక చర్చ కోసం ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తారని సమాచారం. ఆగస్టు 16,17,18 తేదీల్లో సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.