హైదరాబాద్: 28°C
వార్తలు

ఆళ్లగడ్డలో పర్యటించిన ఎమ్మెల్యే

NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని టిడ్కో గృహాల కాలనీలో బుధవారం ఎమ్మెల్యే భూమా అఖిల పర్యటించారు. 'మన భూమా మన ధీమా' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.