హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్త ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

ఎన్డీఏ కూటమికి చెందిన నూతన రాజ్యసభ ఎంపీలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన సుమారు 30 మంది కొత్త ఎంపీలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సభలో ఎంపీలు ఎలా నడుచుకోవాలి, ప్రజా సమస్యలపై ఎలా స్పందించాలి అనే పలు కీలక విషయాలపై ప్రధాని మోదీ వారికి దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. సభా నియమాలను పాటిస్తూ ఎంతో హుందాగా వ్యవహరించాలని సూచించారు.