హైదరాబాద్: 28°C
వార్తలు

బస్సులో మహిళకు గుండెపోటు.. దక్కిన ప్రాణాలు

కర్ణాటకలో తుమకూరు-మధుగిరి బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. పరిస్థితిని గమనించిన డ్రైవర్ క్షణం ఆలస్యం చేయకుండా బస్సును నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో చికిత్స అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు. అలాగే, డ్రైవర్‌ను అభినందిస్తున్నారు.