హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థిని దీక్షితకు ఘన సత్కారం

PLD: నరసరావుపేట కే-రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 4వ తరగతి విద్యార్థిని బి. దీక్షిత హైదరాబాద్‌లో జరిగిన "సంగీత నృత్య నీరాజనం" కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రశంసాపత్రం అందుకుంది. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు ఆమెను అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.