ADB: అంబులెన్సులో మహిళ ప్రసవించగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు 108 అంబులెన్స్ ఈఎంటీ సిద్దేశ్వర్ తెలిపారు. ఇంద్రవెల్లి మండల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గర్భిణీని డెలివరీ కోసం ADBకు అంబులెన్సులో తరలిస్తుండగా మార్గమధ్యంలో పురటినొప్పులు ఎక్కువకావడంతో సుఖ ప్రసవం చేసి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తంఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు.
వార్తలు
108లో మహిళ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం


