హైదరాబాద్: 28°C
వార్తలు

'పీఎం సూర్య ఘర్‌'తో 50 లక్షల మందికి లబ్ధి

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన 'పీఎం సూర్య ఘర్' పథకం అద్భుత విజయం సాధించింది. ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ ప్యానెళ్లు అమర్చుకున్న కుటుంబాల సంఖ్య కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 50.06 లక్షలకు చేరినట్లు పునరుత్పాదక విద్యుత్ శాఖ వెల్లడించింది. కాగా, ఈ స్కీమ్ రాక ముందు పదేళ్లలో కేవలం 7.94 లక్షల ఇళ్లపై మాత్రమే సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు కావడం గమనార్హం.