VSP: విశాఖ నగరంలో టౌన్ కొత్త రోడ్డు పరిధిలోని పోస్ట్ ఆఫీస్ వద్ద గత రెండు నెలలుగా బోరింగ్ పనిచేయకపోవడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీని మరమ్మతుల కోసం అధికారులకు పలుమార్లు విన్నవించుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత సిబ్బంది స్పందించి తమ తాగునీటి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.
వార్తలు
టౌన్ కొత్త రోడ్డులో పనిచేయని బోరింగ్


