హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ గాంధీతో కిరణ్ రిజుజు భేటీ

పార్లమెంట్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది. ఇందులో భాగంగా కేంద్రమంత్రి కిరణ్ రిజుజు విపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఆవరణలోని విపక్ష నేత కార్యాలయంలో జరిగిన ఈ కీలక భేటీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. సభ సజావుగా సాగేలా ప్రతిపక్షాలు సహకరించాలని మంత్రి కోరారు.