హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి'

AKP: ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. బుధవారం రామచంద్రపాలెం గ్రామంలో స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని నిర్వహించి రహదారులను శుభ్రం చేయించారు. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చి దిద్దడానికి పంచాయతీ కార్యదర్శులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన వాతావరణ ఏర్పడుతుందన్నారు.