హైదరాబాద్: 28°C
వార్తలు

ఆసుపత్రిలో వర్షపు నీరు.. కాలువకు డిమాండ్

WNP: ఆత్మకూరు మున్సిపాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు కాలువ లేక నీరు చేరుతోంది. ఇటీవల కురిసిన వర్షానికి ఆసుపత్రి ఆవరణ జలమయమై రోగులు, బంధువులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటి పారుదల కోసం కాలువ ఏర్పాటు చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.