హైదరాబాద్: 28°C
వార్తలు

అమెరికాలో భారత్‌కు అరుదైన గౌరవం

భారత స్వాతంత్య్ర దినోత్సవానికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఆగస్టు 15వ తేదీని ఇకపై 'ఇండియా డే'గా పాటిస్తామని అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్ర గవర్నర్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రత్యేక గుర్తింపు పట్ల అక్కడి భారతీయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలకు, ప్రవాస భారతీయుల నిరంతర కృషికి ఈ నిర్ణయం ఒక గొప్ప నిదర్శనంగా నిలుస్తోంది.