హైదరాబాద్: 28°C
వార్తలు

విపక్షాల నినాదాలు.. లోక్‌సభ వాయిదా

లోక్‌సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. విద్యార్థులపై పోలీసుల దాడులు, అయోధ్య విరాళాల చోరీ అంశాలపై సభలో చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. సభ్యుల ఆందోళనల మధ్య సభను నడిపించడం కష్టం కావడంతో స్పీకర్ సభను మ.2 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు, రాజ్యసభలోనూ విపక్షాల నిరసనలు కొనసాగుతున్నప్పటికీ సభ కొనసాగుతోంది.