ప్రకాశం: కంకణంపాడు సచివాలయ పరిధిలో బుధవారం తల్లిపాల వారోత్సవాలను అంగన్వాడి, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కార్యకర్త తిరుపతమ్మ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రు పాలు పట్టించి, తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందించి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు.
వార్తలు
తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ


