హైదరాబాద్: 28°C
వార్తలు

భారత నౌకపై హౌతీల దాడి

యెమెన్ తీరంలో భారత వాణిజ్య నౌకపై హౌతీ రెబల్స్ దారుణ దాడికి పాల్పడ్డారు. పేలుడు పదార్థాలతో నిండిన మరో పడవతో వచ్చి ఈ వాణిజ్య నౌకను బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో జరిగిన భారీ పేలుడు ధాటికి నౌక పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. అయితే, అదృష్టవశాత్తూ ఈ నౌకలో ఉన్న 13 మంది భారతీయులు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.