హైదరాబాద్: 28°C
వార్తలు

'మేనమామ బంగారు కానుక' రూ.560 కోట్లు

తమిళనాడులో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంత్రి విల్సన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వాస్పత్రిలో పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరం.. 'మేనమామ బంగారు కానుక' పథకానికి రూ.560 కోట్ల కేటాయించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులకు రూ.125 కోట్లు, జెన్ జీ విద్యార్థులకు రూ.2 వేల కోట్లు, ఉచితంగా ల్యాప్‌టాప్, సైకిళ్లు, హెల్మెట్లు అందజేసేలా బడ్జెట్ రూపొందించారు.