హైదరాబాద్: 28°C
వార్తలు

పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

GDWL: తుంగభద్ర నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలంపూర్ ఎస్సై రామకృష్ణ సూచించారు. భారీ వర్షాల కారణంగా తుంగభద్ర డ్యామ్‌లోకి భారీగా నీరు చేరుతోందని తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున నది ఒడ్డున నివసించే ప్రజలు, భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.