హైదరాబాద్: 28°C
వార్తలు

ఇది రాచరికం కాదు: ప్రియాంకా గాంధీ

పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. గాంధీ విగ్రహం నుంచి మకర్ ద్వార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులపై దాడుల మీద హోంమంత్రి ప్రకటన చేయాలని, అయోధ్య విరాళాలపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. ఇది ప్రజాస్వామ్యమని, రాచరికం కాదని మండిపడ్డారు. విద్యార్థులపై దాడులకు సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు.