హైదరాబాద్: 28°C
వార్తలు

సిద్ధరామయ్య అలిగారా?.. కుమారుడి క్లారిటీ

కర్ణాటకలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం సిద్ధరామయ్య హాజరుకాకపోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కురుబ వర్గం నుంచి ఆయన సిఫార్సు చేసిన ఇద్దరు నేతలకు మంత్రి పదవులు దక్కకపోవడంతోనే ఆయన అలిగారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను ఆయన కుమారుడు యతీంద్ర ఖండించారు. తన తండ్రికి ఎలాంటి ఆగ్రహం లేదని, ఆయన అలిగారనడం అవాస్తవమని స్పష్టం చేశారు.