హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

PLD: పెదకూరపాడు మండలం కాశిపాడులో మంగళవారం రాత్రి జరిగిన ‘2 ఏళ్ల నమ్మకం’ ప్రచారంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొని ఇంటింటికీ తిరిగారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే 90% హామీలను నెరవేర్చిందని, సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.