హైదరాబాద్: 28°C
వార్తలు

యువకుడిపై దాడి.. ఎస్పీకి వినతి!

KRNL: ఆదోని కుప్పగల్లులో దళిత యువకుడు మల్లికార్జునపై బీజేపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు. దళిత బాలికపై అసభ్య వ్యాఖ్యలు చేసిన యువకుడిని నిలదీయడంతో ప్రతీకారంగా తనపై దాడి చేశారని పేర్కొన్నాడు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరగా, గాయపడిన మల్లికార్జున ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.