AP: ప్రభుత్వ స్కూళ్లలో సిక్ రూములను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. విద్యార్థులు అనారోగ్యానికి గురైనా, గాయపడినా చికిత్స అందించేందుకు ఇవి ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. 629 పీఎంశ్రీ స్కూళ్లకు రూ.5 లక్షల చొప్పున కేటాయించినట్లు వెల్లడించారు. గదిలో బెడ్, మందులతో పాటు స్థానిక ANM సేవలు అందేలా చూడనున్నారు. నెల రోజుల్లో వీటిని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టారు.
వార్తలు
ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ రూములు


