KRNL: ఆషాఢ మాసం మూడవ మంగళవారం సందర్భంగా ఆదోనిలోని కల్లుబావిలో కందనాతి మారెమ్మ అవ్వ గంప జాతరను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ సుభిక్షం, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి భవిష్యవాణిని వినిపించారు. జాతరను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వార్తలు
ఆదోనిలో కందనాతి మారెమ్మ అవ్వ గంప జాతర


