హైదరాబాద్: 28°C
వార్తలు

'భూముల రీ-సర్వే వేగవంతం చేయాలి'

HNK: ఐనవోలు మండలం పంథిని గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే పనులను ఇన్‌‌ఛార్జి కలెక్టర్ ఎన్. రవి మంగళవారం పరిశీలించారు. రైతులకు ముందస్తుగా సమాచారం ఇచ్చివారి సహకారంతో సర్వే నిర్వహించాలని, ప్రతి బృందం రోజుకు కనీసం 75 ఎకరాల మేర రీ-సర్వే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత, పారదర్శకతతో రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలన్నారు.