హైదరాబాద్: 28°C
వార్తలు

'ఈ-20తో ఇంజిన్లకు ముప్పు'.. సియామ్‌ ఆందోళన

ఈ-20(పెట్రోల్‌లో 20% ఇథనాల్) ఇంధనం వినియోగంపై ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య(సియామ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఇంధనంలో క్లోరైడ్ స్థాయులు అధికంగా ఉంటున్నాయని, దీనివల్ల వాహనాల ఇంజిన్లు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇంధనంలో క్లోరైడ్ పరిమితులను తక్షణమే నిర్దేశించాలని కోరుతూ పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సియామ్ లేఖ రాసింది.