హైదరాబాద్: 28°C
వార్తలు

నాన్ ఆక్వా జోన్ రైతులకు భారీ ఊరట

AP: నాన్ ఆక్వా జోన్‌లో సాగుచేస్తున్న రైతులకూ ప్రభుత్వం ఊరట కలిగించింది. వారికి విద్యుత్ రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు నాన్ ఆక్వా జోన్‌లోని ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇవ్వనున్నారు. ఈనెల నుంచే దీన్ని అమలు చేయాలని అధికారులకు CM చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ విద్యుత్ రాయితీ లభించనుంది.