హైదరాబాద్: 28°C
వార్తలు

రెండు రోజుల పాటు సీజేపీ మీటింగ్

సీజేపీ భవిష్యత్ కార్యాచరణ, తదుపరి వ్యూహాలపై చర్చించేందుకు పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ సీజేపీ నేత అభిజిత్ నివాసంలో సమావేశం జరగనుంది. రెండు రోజుల పాటు సాగనున్న ఈ సుదీర్ఘ మంతనాల్లో పార్టీ బలోపేతం, భవిష్యత్ ప్రణాళికలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. కాగా, జార్ఖండ్‌లో జరుగుతున్న విద్యార్థుల నిరసనల్లో సీజేపీ పాల్గొనకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.