కోనసీమ: విద్యతోనే సమాజ ప్రగతి సాధ్యమవుతుందని DEO SK మహబూబ్ బాషా పేర్కొన్నారు. మంగళవారం ముమ్మిడివరంలోని బాలురు, బాలికల ZPHS పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా పరంగా ప్రతి విద్యార్థీ షైనింగ్ స్టార్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా చదువుకోవాలని, ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధనకు కృషి చేయాలన్నారు.
వార్తలు
విద్యతోనే సమాజ ప్రగతి సాధ్యం: డీఈఓ


