AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)లు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2.14 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో 74 వేల మందికిపైగా ఇన్ సర్వీస్ టీచర్లున్నారు. ఈనెల 16 వరకు రోజూ రెండు విడతల్లో పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ 9:30AM-12PM, రెండో సెషన్ 2:30PM- 5PM వరకు ఉంటుంది. 103 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈనెల 24న కీ, SEP 15న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
వార్తలు
నేటి నుంచి టెట్ పరీక్షలు


