హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై DMHO సమీక్ష

NZB: జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై డీఎంహెచ్‌వో డా. బి. రాజశ్రీ జూమ్ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు. జీవనశైలి వ్యాధుల స్క్రీనింగ్, ఏబీహెచ్‌ఏ కార్డుల జనరేషన్, టీకా కార్యక్రమాలు, గర్భిణుల సంరక్షణ, ఓపీ సేవలను నూటికి నూరు శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.