హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుపతిలో 25 మందికి భారీగా జరిమానా

తిరుపతిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 25 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.2.50 లక్షల జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.