హైదరాబాద్: 28°C
వార్తలు

ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటూ విజ్ఞప్తి

MDK: నిజాంపేట మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్, రుక్మిణి దంపతుల ఇల్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పినప్పటికీ, ఉండటానికి నీడ లేక ఆ పేద కుటుంబం అల్లాడుతోంది. కష్టాల్లో ఉన్న తమను అధికారులు కనికరించి, ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని బాధితులు ప్రాధేయపడుతున్నారు.