హైదరాబాద్: 28°C
వార్తలు

సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు ఆందోళన

దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సైబర్ నేరాల్లో విస్తృతంగా వాడుతున్న మ్యూల్ బ్యాంకు ఖాతాలపై SOP రూపొందించి అన్ని బ్యాంకులకు ఇవ్వాలని RBIని ఆదేశించింది. దీనివల్ల నేరస్థుల గుర్తింపు, బాధితుల డబ్బు రికవరీ సులువవుతుందని పేర్కొంది. ఇలాంటి నేరాలపై కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించింది.