హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్‌లో చర్చకు భయపడుతున్నారు: ఖర్గే

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. రామమందిర విరాళాల చోరీ, విద్యార్థులపై లాఠీఛార్జ్ అంశాలపై చర్చకు భయపడుతున్నారని, అందుకే వారు పార్లమెంటుకు రావడం లేదన్నారు. ఈ రెండు అంశాలపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, శ్రీరాముని పేరుతో దోచుకున్న వారు దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలని అన్నారు.