హైదరాబాద్: 28°C
వార్తలు

నేరస్థులపై కేంద్రం ఉక్కుపాదం

దేశం విడిచి పారిపోయిన నేరస్థులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. 2019 నుంచి 36 దేశాల నుంచి 274 మంది నిందితులను భారత్‌కు రప్పించింది. ఆపరేషన్ త్రిశూల్ ద్వారా వారిని గుర్తించి, రూ.17,874 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ జాబితాలో ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, ఆర్థిక నేరస్థులు ఉన్నారు.