హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ ఆఫీసుల్లో కేవలం టీ-ఫైబరే: శ్రీధర్‌బాబు

TG: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ అందించాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. గడువు దాటాక ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దని స్పష్టం చేశారు. టీ-ఫైబర్ ద్వారా ఏటా ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశముందని వెల్లడించారు.