హైదరాబాద్: 28°C
వార్తలు

టీపీసీసీ చీఫ్‌కు హరీష్ రావు లీగల్ నోటీసులు

TG: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కు మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. తనపై క్షుద్ర పూజలంటూ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ నోటీసులు జారీ చేశారు. ఆ వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో న్యాయపరంగా పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.