తెలంగాణలో ఇకపై మండల స్థాయిలోనూ ప్రజావాణి నిర్వహించనున్నారు. అన్ని మండలాల్లో దీనిని ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపీడీవో కార్యాలయంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాగా, ఇప్పటివరకు రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిల్లోనే ఈ కార్యక్రమం అమలవుతున్న సంగతి తెలిసిందే.
వార్తలు
మండల స్థాయిలోనూ 'ప్రజావాణి'


