హైదరాబాద్: 28°C
వార్తలు

'E20 పెట్రోల్.. విదేశీ కరెన్సీ ఆదానే లక్ష్యం'

విదేశీ కరెన్సీ ఆదా చేయడమే లక్ష్యంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పెట్రోలియంశాఖ మంత్రి రాజ్యసభలో తెలిపారు. దీనివల్ల చెరకు, మొక్కజొన్న రైతులకు అదనపు మార్కెట్ లభిస్తుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 2025 తర్వాత తయారైన వాహనాలు E20 పెట్రోల్‌కు పూర్తి అనుకూలమన్నారు. పాత వాహనాల విషయంలో తయారీదారుల సూచనలు పాటించాలని స్పష్టం చేశారు.