హైదరాబాద్: 28°C
వార్తలు

చిలకలూరిపేటలో పర్యటించిన ఎమ్మెల్యే

PLD: కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా సాగుతున్నాయని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జగన్ తన ఆదాయాన్ని పెంచుకుంటే, చంద్రబాబు ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచుతున్నారని తెలిపారు. పొదుపు సంఘాల మహిళలతో మాట్లాడిన ఆయన మున్సిపల్ ఎన్నికల సమరశంఖం పూరించారు.